దామరచర్లలో ఇధనాల్ పరిశ్రమ

09-11-2026 | 09:57pm

దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం(Damaracherla mandal) మండలం లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇందుకు గాను ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. మండలం లోని వీర్లపాలెం గ్రామ పరిధిలో సోహమ్ ఆగ్రో ఇండస్ట్రీస్(Soham Agro Industries) వారు గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ పరిశ్రమ(Build Ethanol Plant) ఏర్పాటు చేయనున్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులో సుమారు 108 ఎకరాల విస్తీర్ణంలో రూ 750 కోట్ల తో ఈ పరిశ్రమ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమ రోజుకు 600 కేఎల్డీ  సామర్థ్యం తో పని చేయనుంది.

20వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ

ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు కోసం ఈనెల 20వ తేదీన   కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పర్యావరణం, జలాల , కాలుష్యం , ఉపాధి అవకాశాలపై ప్రజల అభ్యంతరాలు, వినతులు, అభిప్రాయాలను స్వీకరిస్తారు.

మరిన్ని వార్తలు