సురేంద్ర ఆచార్యకు ప్లాటినం ఐకాన్–2026 అవార్డు
కార్యనిర్వహణాధికారి భవాని శంకర్ అభినందనలు
యాదగిరిగుట్ట, అక్టోబర్ 29 (విజయక్రాంతి): న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో(Telangana Bhavan) ఉజ్వల శిఖరము ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు బట్టార్ సురేంద్ర ఆచార్యులుకు ప్లాటినం ఐకాన్–2026 అవార్డును అందుకున్న సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి భవాని శంకర్ అభినందించారు.
అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక, ధార్మిక రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న అర్చకులను గుర్తించి గౌరవ పురస్కారాలతో సత్కరించడం అభినందనీయ పరిణామం అని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు బట్టార్ సురేంద్ర ఆచార్యులకు ప్లాటినం ఐకాన్–2026 అవార్డు లభించడం వారికి దక్కిన గౌరవమే కాకుండా,
దేవస్థాన ప్రతిష్ఠను ఇనుమడింపజేసే విశేష గౌరవం అని అన్నారు. ఈ పురస్కారం ద్వారా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి మరింత గుర్తింపు లభించడం సంతోషదాయకం అని స్వామివారి నిత్య కైంకర్యాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణలో అర్చకుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. బట్టార్ సురేంద్ర ఆచార్యులు భవిష్యత్తులోనూ ఇదే నిబద్ధతతో స్వామివారి సేవలో కొనసాగుతూ మరిన్ని ప్రశంసలు, పురస్కారాలు అందుకోవాలని అన్నారు.