ప్లకార్ట్స్ లతో నిరసన
కొత్తపల్లి, అక్టోబర్ 29 (విజయక్రాంతి):శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) మెయిన్ గేటు ముందు గురువారం రోజున విద్యార్థి నాయకులు ప్లకార్ట్స్ లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు లింగంపల్లి మహేష్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీలో 2025-26వ విద్యా సంవత్సరం లో వీసి ఉమేష్ కుమార్ చొరవతో రెండు సంవత్సరాల ఎం.ఫార్మసీ విద్యను 3 స్పెషలైజేషన్లతో ఫార్మస్యుటికల్ అనాలసిస్, ఫార్మాసుటిక్స్, ఫార్మకాలజీ ని ఎల్ ఎం డి లో బి ఫార్మసీ కోర్స్ కి కొనసాగింపుగా ఏర్పాటు చేశారు.
కోర్స్ కు కావాల్సిన గెస్ట్ ఫ్యాకల్టీ లను 2025 నోటిఫికేషన్ ద్వారా నియామకం చేశారని ,టీజీ పీజీఈసెట్ స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ నియమనిబందనలు నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలు నింపుకునేలా ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల అవకాశం ఇచ్చారని ఆరోపించారు. అంతే కాకుండా ఎల్ఎండిలో 2009 విద్యా సంవత్సరంలో బీఫార్మసీ కోర్సును,
2025-26లో ఎం.ఫార్మసీ కోర్స్ ఏర్పాటు చేయగా అడ్మిషన్ నోటిఫికేషన్లు ఎం.ఫార్మసీ, బి ఫార్మసీకి ఎల్ ఎం డి నే చిరునామాగా, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) గుర్తింపు కోసం కూడా ఎల్ ఎం డి నే చిరునామాగా చూపిస్తారు. కానీ వీసీ ఎం.ఫార్మసీ కోర్సును తనకిష్టమైన సైన్స్ కళాశాలలో నడిపించడంలో గల ఆంతర్యం ఏమిటో అని తెలియాలని అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల కోసం ప్రభుత్వ జీవోల ద్వారా 2018లో పెంచిన జీతాల తర్వాత ఇప్పటివరకు వారిలో పురోగతి లేదని ,కానీ గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా గత విద్యా సంవత్సరంలో నియామకమైన కొందరు అధ్యాపకుల కోసం వీసీ వారి జీతాల పెంపు కోసం ఇటీవల జరిగిన ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం కోసం ఎజెండా లో పెట్టాగా ,కానీ ఈసీలో ఆమోదించబడలేదు.
ఇంత ప్రత్యేక దివ్యమైన చొరవ ఎవరి కోసం? ఎందుకోసం? అనేది తెలియాల్సిన అవసరం ఉన్నదని, అభివృద్ధి ముసుగులో దివ్య* మైన లీలలా అనేది ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో చర్చనీయమైన అంశంఅయిందన్నారు.
ఎం.ఫార్మసీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం కన్వీనర్ నియమ నిబంధనలు కాదని స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఈ ప్రాంత విద్యార్థుల కోసం లా మరియు ఇతర పీజీ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం తను ప్రత్యేకమైన స్పాట్ కౌన్సిలింగ్ కు నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకొని వీసీ చేస్తున్న ఒంటెద్దు పోకడల మీద,
విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న అనేక అంశాల మీద నిరంతరం పోరాటం చేసి విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం, విశ్వవిద్యాలయాన్ని పరిరక్షించుకుంటామని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చెన్న కుమారస్వామి , పిడియస్యు జిల్లా నాయకులు చొప్పదండి యుగేందర్ మరియు బీఎస్ఎఫ్ మినప ప్రశాంత్ పాల్గొన్నారు