పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి

29-10-2026 | 09:50pm

- అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు కావాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లెందు,(విజయక్రాంతి): వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections)కు సంబంధించి అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) సూచించారు. గురువారం ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు(Graduate Voter Registration) సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా ramreddysarvotham.com వెబ్‌సైట్‌ ద్వారా ఫారం-6 దరఖాస్తుల నమోదుపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. నవంబర్‌ 6వ తేదీలోపు అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువత, విద్యావంతుల సమస్యల పరిష్కారంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్‌ సభ్యుడు రాంరెడ్డి గోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు పోతు భాస్కర్‌, మున్సిపల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, మార్కెట్‌ డైరెక్టర్లు, మండల, బ్లాక్‌, పట్టణ, గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, మహిళా నాయకురాళ్లు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు