యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని కలిసిన పవన్ కుమార్

29-10-2026 | 09:46pm

నంగునూరు: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్(Telangana Youth Congress) అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డిని సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నంగునూరు ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ గురువారం హైదరాబాద్‌ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివ చరణ్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని శివచరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.గ్రామస్థాయిలో యువతను ఆకర్షిస్తూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని పవన్ కుమార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పిడిశెట్టి ప్రభాకర్,సిర్రం భాను తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు