మహిళా సంఘాల అభ్యున్నతికి కృషి
జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు
నిజాంసాగర్,(విజయక్రాంతి): మహిళా సంఘాల(Women's Association) అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఎల్లవేళ లా ఇత నిశ్చయంతో పనిచేస్తుందని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు(Jukkal MLA Thota Laxmikantha Rao) పేర్కొన్నారు. ఆయన గురువారం కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తో కలిసి, నిజాంసాగర్ మండల పరిధిలోని మల్లూరు తాండ, బంజపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సంఘం భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, మహిళలు సంఘటితంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి అనువైన వేదికలను అందుబాటులోకి తీసుకురావడం, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం లక్ష్యంగా ఈ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు.
మహిళా సంఘాల కార్యకలాపాలకు ప్రత్యేక వసతులు అందుబాటులోకి రావడం ద్వారా గ్రామీణ మహిళలకు సమావేశాలు, సంఘ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మరింత సౌకర్యం కలగ నుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.