6 September, 2026 | 9:32 PM

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం

06-09-2026 | 08:14pm

గుండ్లగూడెంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

ఆలేరు, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఆలేరు(Aleru) మండలం గుండ్లగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విగ్రహ కమిటీ అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి శ్రమ శక్తి అవార్డు గ్రహీత(Shrama Shakti Award recipient) డాక్టర్ చిలుకు స్వామి హాజరై మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలు సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, మానవ హక్కులకు మార్గదర్శకమని అన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు