ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యాసంస్థలపై చర్య తీసుకోవాలి
27-11-2026 | 08:16pm
ముకరంపుర, నవంబరు 27 (విజయ క్రాంతి): ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్కాలర్షిప్ టెస్టుల(Scholarship Tests) పేర్లుతో పాఠశాలలు, కళాశాలలు పరీక్షలు నిర్వహించి ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతున్నారని, ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యాసంస్థలపై చర్య తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి కోరారు.
ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ విద్యా శాఖ కార్యదర్శి యోగిత రాణాకు వెరైటీ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు బోయిని ప్రశాంత్, బండి క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.