సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి
మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి
నేరేడుచర్ల, నవంబర్ 25(విజయక్రాంతి): ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను(welfare schemes) అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి(Municipal Chairman Konatham Chinna Venkat Reddy) అన్నారు. మున్సిపాలిటీలోని పాత నేరేడుచర్ల రామాలయం వద్ద మరియు మున్సిపాలిటీ కార్యాలయంలో 1, 8, 14, 15 వార్డులలో అర్హులకు పెన్షన్లు(Pensions) మరియు ఇందిరమ్మ ఇళ్ల(Indiramma's house) మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిషనర్ చెన్నబోయిన నాగరాజు మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి 1వ వార్డు కౌన్సిలర్ గుగులోతు రవీందర్ నాయక్,8వ వార్డు కౌన్సిలర్ తాళ్ళ లావణ్య, 9వ వార్డు కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్, 14వ వార్డు కౌన్సిలర్అరూరి విజయలక్ష్మి,కో-ఆప్షన్ సభ్యులు షేక్ మొగల్బి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్ళ సురేష్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ రేణపంగ నాగయ్య సింగిల్ విండో డైరెక్టర్ శంకరాచారి ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు.