37 ఏళ్ల తర్వాత కలిసిన చిన్ననాటి మిత్రులు
పాఠశాల రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన పూర్వ విద్యార్థులు
గురువులకు ఘన సన్మానం
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),అక్టోబర్ 26: మండల పరిధిలోని తిమ్మాపురం జడ్పీహెచ్ఎస్(Thimmapuram ZPHS) 1988-89 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహిచారు. దాదాపు 37 ఏళ్ల తర్వాత అంతా ఒక్కచోట కలుసుకోవడంతో ఆత్మీయత వెల్లివిరిసింది.
ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు శ్రీనివాసరెడ్డి, స్వరాజ్యం, భాగ్యలక్ష్మిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.చిన్ననాటి జ్ఞాపకాలను, పాఠశాల రోజుల అనుభవాలను ఒకరికొకరు పంచుకుంటూ సంతోషంలో మునిగిపోయారు. పాఠశాలలో తమ బాల్యం గుర్తుకు వచ్చిందని,గురువుల ఆశీస్సులు తమ జీవిత ఉన్నతికి కారణమని పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆబ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.