విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాం బహూకరణ
నేరేడుచర్ల, అక్టోబర్ 09(విజయ క్రాంతి):- నేరేడుచర్ల మండలంలోని పెంచికల్‌దిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Zilla Parishad High School) విద్యార్థులకు అమెరికాలో స్థిరపడిన పాఠశాల పూర్వ విద్యార్థి నాయిని సైదులు(Naini Saidulu) తాను చదువుకున్న పాఠశాలపై ప్రేమతో సుమారు రూ.80 వేల విలువైన స్పోర్ట్స్ యూనిఫాంలను(Sports uniform) అందజేశారు. వీటిని ఆయన తల్లిదండ్రులు నాయిని సోమయ్య, సైదమ్మ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ(Distribution to students) చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింగ్ చిన్న సోములు మాట్లాడుతూ పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ఐదుగురు పేద విద్యార్థుల ఉన్నత విద్యకు నాయిని సైదులు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకొచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎల్. శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు వల్లంశెట్ల లచ్చయ్య, మాజీ సర్పంచ్ మర్రి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.