పోగొట్టుకున్న ఫోన్ ను బాధితుడికి అప్పగించిన పోలీసులు

09-10-2026 | 11:57pm

మూసాపేట్/ అక్టోబర్ 10: మూసాపేట పోలీస్ స్టేషన్(Moosapet Police Station) పరిధిలోని నిజాలాపూర్ గ్రామానికి చెందిన భీమ్ సాగర్ అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను(Mobile phone) గత జనవరి 31, 2026 న పోగొట్టుకోవడం జరిగింది. బాధితుని ఫిర్యాదు మేరకు మూసాపేట పోలీసులు CEIR (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్)(Central Equipment Identity Register) పోర్టల్ సహాయంతో ఫోన్ సమాచారాన్ని నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సురక్షితంగా రికవర్ చేశారు.  

​ శుక్రవారం మూసాపేట పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ ఎం. వేణు  ఆధ్వర్యంలో, సిఈఐఆర్ ఆపరేటర్ యు. అచ్యుత్ కుమార్ సహకారంతో రికవర్(Recover) చేసిన మొబైల్ ఫోన్‌ను బాధితుడు భీమ్ సాగర్‌కు పిఎస్ లో అందజేయడం జరిగింది.  

​పోగొట్టుకున్న తన ఫోన్‌ను వేగంగా రికవర్ చేసి అప్పగించినందుకు బాధితుడు భీమ్ సాగర్ మూసాపేట పోలీసులకు మరియు సిఈఐఆర్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ​ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే CEIR పోర్టల్ (ceir.gov.in) ద్వారా లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్.ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు