భీంపూర్ ను కరువు మండలంగా ప్రకటించాలి

09-10-2026 | 11:44pm

తాంసి/భీంపూర్, అక్టోబర్ 9(విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో(Impact of El Nino) సరైన వర్షాలు లేక పంటలు ఎండి పోతున్నాయని, భీంపూర్ మండలంలోని రైతులు(Farmers) ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిగణలోనికి తీసుకొని భీంపూర్ మండలాన్ని(Bheempoor Mandal) కరువు మండలంగా ప్రకటించాలని శుక్రవారం భీంపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు తహసిల్దార్ రమేష్ నాయక్ కు వినతి పత్రం అందించారు..

ఈ సందర్భంగా రైతులు, నాయకులు మాట్లాడుతూ ఎకరానికి రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాడవి లింబాజి, కుడ్మెత సంతోష్,సయ్యద్ బాదర్, బక్కి కపిల్ యాదవ్,షేక్ ఆఫ్రోజ్,వినోద్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు