హౌస్ సర్జన్ వైద్యులకు సమాన పారితోషకం చెల్లించాలి

09-10-2026 | 11:35pm

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 09 (విజయ క్రాంతి): జాతీయ మెడికల్ కౌన్సిల్(National Medical Council) సూచించిన విధంగా ఇంటర్షిప్ కాలంలో ప్రతి గ్రాడ్యూయేట్ వైద్యుడికి(Graduate doctor) పారితోషకం చెల్లించాలని ఫారెన్ మెడికల్  గ్రాడ్యుయేట్ డాక్టర్లు(Foreign Medical Graduate Doctors) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(Government General Hospital) లో  పనిచేస్తున్న  హౌస్ సర్జన్(House Surgeon)  వైద్యులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  2026 జనవరి నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి స్టై ఫండ్ స్వీకరించలేదని పస్తులతో విధులు నిర్వహిస్తున్నామని, ఆసుపత్రిలలో  క్యాజువాలిటీ ఇంటెన్సిస్ కేర్ యూనిట్ అన్ని విభాగాల ఓపి సేవలు 24 గంటలు అందిస్తున్నామని  సమాన వైద్య సేవలకు సమాన పారితోశకం 29 వేల 792 చెల్లించి సరైన న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోవైద్యులు,చిమట ఆకాష్,పూర్ణ భట్రాజ్,అర్చన శర్మ,గిరి రాజ్,ఆయేషా,కల్పన,ఇంద్రాణి నిషాంక,ఆయేషా సుల్తాన్ ముఖరం,వర్షిత, ధరణి సాయి, ప్రదిషా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు