కంపెనీ స్థాయి క్రీడా పోటీల్లో సత్తా చాటిన

10-10-2026 | 12:03am
  1. భూపాలపల్లి ఏరియా క్రీడాకారులు 
  2. సింగరేణి స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ మెన్ టైటిళ్లు కైవసం
  3. కోల్ ఇండియా స్థాయి పోటీలకు పలువురు ఎంపిక
  4. విజేతలకు ఏరియా జీఎం ప్రత్యేక అభినందనలు

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 09 ( విజయక్రాంతి ) : సింగరేణి బెల్లంపల్లి ఏరియా(Singareni Bellampalli Area) పరిధిలోని గోలేటిలో శుక్రవారం నిర్వహించిన సింగరేణి కంపెనీ(Singareni Company) స్థాయి పవర్ లిఫ్టింగ్(Powerlifting), వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో భూపాలపల్లి ఏరియాకు(Bhupalpally Area) చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పలు పతకాలు, టైటిళ్లు(Medals and Titles) సాధించి పలువురు క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 

మహిళల 69 కిలోల పవర్ లిఫ్టింగ్ విభాగంలో దువ్వ అనూష, పురుషుల 93 కిలోల పవర్ లిఫ్టింగ్ విభాగంలో శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) ప్రథమ స్థానాలు సాధించి సింగరేణి స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ మెన్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు.

అదేవిధంగా 120 కిలోలకు పైబడిన పవర్ లిఫ్టింగ్ విభాగంలో మీర్జా యాసిన్ బెగ్, 75 కిలోల విభాగంలో పి ప్రకాష్ ప్రథమ స్థానాలు, 75 కిలోల బాడీ బిల్డింగ్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. బాడీ బిల్డింగ్ 55 కిలోల విభాగంలో ప్రదీప్ స్వర్ణ పతకం, 74 కిలోల పవర్ లిఫ్టింగ్ విభాగంలో బిల్లకంటి వెంకటేశ్వర్లు ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి విజేతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కోల్ ఇండియా స్థాయి పోటీలలో కూడా పతకాలు సాధించి భూపాలపల్లి ఏరియాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు