అడ్డగోలు ప్రమోషన్లకు ఎస్ యు వీసీ తెర
కొత్తపల్లి, అక్టోబరు 9 (విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో(Satavahana University) ఉపకులపతి ఉమేష్ కుమార్(Umesh Kumar) అర్హతలేని వారికి అడ్డగోలు ప్రమోషన్లకు(Promotions) తెర లేపారని బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగంపల్లి మహేష్(Lingampalli Mahesh), అమ్మ వెంకటేష్ లు ఒక ప్రకటనలో ఆరోపించారు. నిజాయితీపరులకు, అర్హులకు ప్రమోషన్ దక్కితే ప్రతి ఒక్కరూ సంతోషిస్తారని, కానీ అనర్హులకు కూడా ప్రమోషన్లు ఇవ్వడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పేర్కొన్నారు.
తన పరిపాలనలో వేలెత్తి చూపకుండా ఉండడానికి భయపడే ముందస్తుగా ఈసీ మెంబర్ల చేతుల మీదుగా ప్రమోషన్లు ఇచ్చాడని, దీనిలో విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న వారికి కూడా ప్రమోషన్లు ఇవ్వడం విస్మయం కలిగిస్తోందని తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ పెద్దలు తక్షణమే విచారణ చేపట్టాలని, అక్రమ ప్రమోషన్లను అడ్డుకోవాలని కోరారు.