ప్రధాన కార్యదర్శి ఎన్. మధుకర్‌తో ఫిరాసత్ అలీ బాక్రీ భేటీ

09-10-2026 | 04:50pm

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ(Mir Firasath Ali Baqri), బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత వ్యవహారాలు) నూతనంగా నియమితులైన ఎన్. మధుకర్( N. Madhukar)ని కలిసి ఆత్మీయంగా సమావేశమయ్యారు.

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సంస్థను మరింత బలోపేతం చేయడానికి, 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు కృషి చేయడానికి, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఫిరాసత్ అలీ బాక్రీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో ఎన్. మధుకర్ కి వారి నూతన బాధ్యతల సందర్భంగా మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు