రామప్పను సందర్శించిన సినీనటుడు ఛత్రపతి శేఖర్

09-10-2026 | 11:47pm

వెంకటాపూర్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ వారసత్వ సంపద(World Heritage Site) రామప్ప దేవాలయాన్ని(Ramappa Temple) ప్రముఖ సినీనటుడు చంద్రశేఖర్(Film actor Chandrasekhar) (ఛత్రపతి శేఖర్) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పర్యాటక గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, కాకతీయుల నిర్మాణ నైపుణ్యం(architectural prowess of the Kakatiyas), శిల్పకళా వైభవం(Splendor of Sculptural Art) గురించి వివరించారు.

ఛత్రపతి, ఈగ, ఆర్ఆర్ఆర్, మగధీర, సై, సింహాద్రి, విక్రమార్కుడు తదితర చిత్రాల్లో నటించిన చంద్రశేఖర్.. ఛత్రపతి సినిమా ద్వారా ఛత్రపతి శేఖర్‌గా గుర్తింపు పొందారు. అనంతరం ఆయన రామప్ప చెరువును సందర్శించి పర్యాటక శాఖకు చెందిన బోట్లలో బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు అరుణ్, శ్రీకాంత్, బద్రు, శ్రీనివాస్‌తో పాటు పురావస్తు, దేవాదాయ, పర్యాటక శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు