గుడ్డులోని పోషక విలువలపై ప్రజల్లో అవగాహన పెంచాలి
పశుసంవర్థక, క్రీడలు,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
అబ్దుల్లాపూర్మెట్, అక్టోబర్ 09: గుడ్డులోని పోషక విలువలపై(Nutritional values) ప్రజల్లో అవగాహన పెంచాలని పశుసంవర్థక, క్రీడలు,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) అన్నారు. తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, నెక్ పౌల్ట్రీ ఇండియా(Telangana Poultry Federation, NECC Poultry India) ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద అంబర్పేట్లో ప్రపంచ గుడ్డు దినోత్సవ వేడుకలు(World Egg Day Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వాకిటి శ్రీహరి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, రైతులు, ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజల్లో గుడ్డు పోషక విలువలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. గుడ్డు, పాలు, మాంసం వంటి పోషకాహార పదార్థాల వినియోగంపై సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సమతుల ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని మంత్రి అన్నారు. పౌల్ట్రీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గుడ్డు పోషకాలు సమృద్ధిగా కలిగిన, సామాన్యులకు అందుబాటు ధరలో లభించే ఆహారమని తెలిపారు. పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ.. గుడ్డులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు డెవపల్మెంట్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, గుర్రం శేఖర్ రెడ్డి, చైర్మన్ నెక్ హైదరాబాద్ జోన్, బాలకృష్ణ రెడ్డి, వైస్ చైర్మన్ నెక్, డాక్టర్ తిరుపతి తెలంగాణ పౌల్ట్రీ బ్రాయిలర్ బ్రీడర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పౌల్ట్రీ రైతులు తదితరులు పాల్గొన్నారు.