పాఠశాలల్లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు

09-10-2026 | 11:42pm

* ఆటపాటలతో అలరించిన విద్యార్థులు.. 

* తెలంగాణ సంస్కృతికి పట్టం

* దసరా సెలవుల వేళ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో సందడి

పాపన్నపేట,అక్టోబర్09: పూలను పేర్చి బతుకమ్మను కొలిచారు.. చప్పట్లతో పాటలు పాడుతూ చుట్టూ తిరిగి ఆడారు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను(Telangana culture and traditions) ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలతో శుక్రవారం పాఠశాలలు సందడిగా మారాయి. దసరా సెలవుల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో(Government and private schools) విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొని పండుగ శోభను తీసుకొచ్చారు.

రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ విద్యార్థులు సందడి చేశారు. ఆటపాటలతో పాఠశాల ప్రాంగణాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులు ఈ వేడుకల ద్వారా చాటిచెప్పారు. చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేలా ఇలాంటి వేడుకలు దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థుల కేరింతలు, బతుకమ్మ పాటలతో పాఠశాలల్లో పండుగ సందడి నెలకొంది.

మరిన్ని వార్తలు