కరెంటు కోతలపై రైతన్న కన్నెర్ర!
నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా, రాస్తారోకో
పాపన్నపేట,అక్టోబర్09: పంటలకు(Crops) నీరందించాల్సిన వేళ కరెంటు కోతలు(Power cuts).. కళ్లముందే ఎండిపోతున్న పంటలు.. అధికారుల తీరుపై అన్నదాతల ఆగ్రహం!(Farmers' Anger) అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ శుక్రవారం మెదక్ జిల్లా(Medak District) పాపన్నపేట మండలం నార్సింగి సబ్‌స్టేషన్(Narsingi Substation) ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. బీజేపీ ఆధ్వర్యంలో మెదక్–బోడ్మట్‌పల్లి రహదారిపై దాదాపు రెండు గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
వ్యవసాయానికి సకాలంలో విద్యుత్ అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ ఏడీఈ వెంకటేశ్వర్లు, ఏఈ నర్సింలు ఆందోళన స్థలానికి వచ్చి తమ సమస్యలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.
అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.