ఎల్‌నినో ఎఫెక్ట్‌.. సీఎం రేవంత్ కీలక భేటీ

09-10-2026 | 07:03pm

హైదరాబాద్: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం(Telangana El Nino Effect), వర్షాభావ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాగునీరు, తాగునీటి సరఫరాపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 12న మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

వర్షాల కొరత నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించి, అవసరమైన చర్యలపై దృష్టి పెట్టనున్నారు. రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదవగా, 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. రైతుల ఇబ్బందులు, వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరాపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను అంచనా వేయడం, రైతులకు అవసరమైన సహాయక చర్యలపై చర్చించడం సమావేశంలో కీలకం కానుంది.

మరిన్ని వార్తలు