గర్భిణులు, బాలింతలు, పిల్లలు సమతుల్య ఆహారం తీసుకోవాలి: సీడీపీఓ పార్వతి

28-09-2026 | 11:09pm

మఠంపల్లి సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మండలంలోని మఠంపల్లి సెక్టార్ పరిధిలోని కృష్ణ తండాలో 9వ పోషణ మాసం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజూర్నగర్ ప్రాజెక్ట్ సీడీపీఓ మడావత్ పార్వతి(CDPO Madavath Parvathi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడీపీఓ మడావత్ పార్వతి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు అలాగే కిశోర బాలికలలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

మనం నిత్య జీవితంలో తీసుకునే ఆహారం సమతుల్యంగా, సంపూర్ణ పోషకాలతో కూడుకున్నదై ఉండాలని లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ హిమబిందు,ఆర్ఐ జానీ పాషా,సర్పంచ్ బానోతు రమాదేవి శంకర్ నాయక్, ఆవిరేణి కుంట తండా ఉప సర్పంచ్, కార్యదర్శి లక్ష్మీపార్వతి,సెక్టార్ సూపర్వైజర్ మేరీ,అంగన్వాడీ టీచర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు