ఖమ్మంలో గోల్ మాల్.. ఇంటర్ కాలేజీ
- కార్పొరేట్ విద్యతో విద్యార్థుల భవిష్యత్‌కు పంగనామాలు..?
- చదువు ఒకచోట ధ్రువపత్రం మరోచోట
- కొన్నేళ్లుగా అనుమతులు లేకుండానే కళాశాల చదువులు కొనసాగింపు
- ఇటీవలే ఇంటర్ మొదటి సంవత్సరం అనుమతి పొందిన సదరు కళాశాల యాజమాన్యం
- ఇంటర్ ద్వితీయ విద్యా సంవత్సరం ధ్రువపత్రాలు మరో కళాశాల పేరుతో సదరు విద్యార్థులకు అందజేత
ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి) : తమ పిల్లల భవిష్యత్తుకు విద్యాలయాలే దేవాలయాలుగా భావిస్తున్న తల్లిదండ్రులకు ఖమ్మం జిల్లా కేంద్రంలో కొన్ని ఇంటర్ విద్యా సంస్థలు(Intermediate educational institutions) పేరుకు మాత్రం మహోన్నత అక్షర పద వచనతో కలిగిన నామకరణ బోర్డులు దర్శనమిస్తూ... విద్య సంస్థ పేరుతో రాజకీయాలు చేస్తున్నరని ఆరోపణలు వెలువెళుతున్నాయి. విద్యాభ్యాసం అందించే అంశంలో మాత్రం విద్యా ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు పోస్తూ.. నాణ్యత లేని విద్యను విద్యార్థులకు అంట గడుతు..
నాసిరకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఒక ప్రైవేట్ కళాశాల అని చెప్పక తప్పదు. లక్షలు వెచ్చించి తమ పిల్లల విద్యార్థి కోసం ఫీజులు చెల్లిస్తుంటే సదరు కళాశాల యాజమాన్యాలు మాత్రం చదువుతున్న కళాశాల పేరుతో ఫీజుల రసీదులు అందించి విద్యాభ్యాసం అనంతరం ధ్రువపత్రం మాత్రం మరో కళాశాల పేరుతో అందిస్తున్న వైనం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్మిషన్లు వద్ద నుంచి మొదలుకొని పిల్లల చదువుల విషయం వరకు లక్షల రూపాయలు వెచ్చించి తమ పిల్లల భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు.
అయినప్పటికీ కార్పొరేట్ విద్య కోసం పిల్లల తల్లిదండ్రులు వ్యయ ప్రయాసాలు కోర్చి... పిల్లల భవిష్యత్తు కోసం వారు కలో...గటకో తాగుతూ.. పిల్లల విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు చేసే త్యాగం అన్ని ఇన్ని కావు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కొందరి విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యాన ఉచితంగా వస్తున్న సన్న రేషన్ బియ్యాన్ని ఆనందంగా భుజిస్తూ...చిన్నారులకు సన్న బియ్యంతో భోజనం పెడుతూ ఆర్థిక వ్యయాల నుంచి తప్పించుకుంటూ కొన్ని వృథా ఖర్చులను అధిగ మించి కళాశాల ఫీజుల కోసం డబ్బులను పొలుపు చేస్తూ...
ఫీజులు చెల్లిస్తుంటే... బాగా తిని కండ పెరిగిన కోడి వలె కొన్ని కళాశాల యాజమాన్యాలు మేము చెప్పిందే వేదం... మేము ఆడిం దే నాట్యం... మా జేబులో సదరు మంత్రి పె న్ను లాంటి వారు..,అని ఆనోటా ఈ నోట మంత్రి తనయుడుకు కూడా మేము ఎంత చెప్తే అంతే.. అనే విధంగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి..
అనుమతులు లేకుండానే కార్యకలాపాలు
ఖమ్మం నగరంలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ వెనుక భాగాన గల ఒక ఇంటర్ విద్యా సంస్థకు గత కొన్ని ఏళ్లుగా ఇంటర్ కళాశాల అనుమతి లేకుండానే కార్యకలాపాలు కొనసాగినట్లు సమాచారం.. ఖమ్మం జిల్లా కేంద్రం లో కొన్ని కార్పొరేట్ విద్యతో విద్యార్థుల భవిష్యత్తుకు పంగనామాలు పెడుతున్నాయని విమర్శలు గుప్పు మంటున్నాయి.. చదువు ఒకచోట ధ్రువపత్రం మరోచోట అన్న చందంగా తయారయింది ఈ విద్యా వ్యవస్థ..
‘మామూలు’గా తీసుకుంటున్న సదరు అధికారి..?
ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో అధికారి తన విధులను మరచి... మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు పలు విమర్శలు విని పిస్తున్నాయి.. ఖమ్మం జిల్లా కేంద్రంలో కొన్ని సామాజిక వర్గాలు ఒకరితో ప్రజాప్రతినిధి పేరుతో చలామణి అవుతూ ఆమ్యామ్యాలకు ఆజ్యం ఆజ్యం పోస్తూ... నాణ్యమైన ఇంటర్ విద్యను తుంగలో తొక్కుతున్నారని ఆరోపణలువినిపిస్తున్నాయి.
ఇంటర్ ద్వితీయ విద్యా సంవత్సరం ధ్రువపత్రాలు మరో కళాశాల పేరుతో సదరు విద్యార్థులకు అందజేత
ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కళాశాల ఫీజు మాత్రం ప్రస్తుతం ఉన్న బోర్డుపై గల నామకరణం పేరుతో ఉన్న కళాశాల పేరుతో గల ఫీజు రసీదును అందిస్తూ చదువు అనంతరం ఇచ్చే ధృవపత్రం మాత్రం మరో కళాశాల పేరుతో అందిస్తున్న వైనం దావనంలో వ్యాపించింది..?
ఖమ్మం నియోజకవర్గ మంత్రి పేరును బధనామ్ చేస్తున్న సదరు కళాశాల యాజమాన్యం.?
కొన్ని కళాశాల యాజమాన్యాలు మీడియా వారితో సదరు అధికారులతో... స్థానిక మంత్రి మాకు బాగా తెలుసునని.. మాకు దూరపు బంధువు కూడా అని... మేము ఎంత చెబితే అంతేనని, కొన్నిచోట్ల సదరు యాజమాన్యాలు బాహాటంగానే పేర్కొంటున్నట్లు తెలుస్తోంది..?