ఇన్సూరెన్స్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్న ఏజెన్సీ

28-09-2026 | 11:01pm

బోథ్ సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): హెచ్.పీ గ్యాస్(HP Gas) వినియోగదారులకు ఏజెన్సీ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఇన్సూరెన్స్ చేయించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న ఉద్దేశంతో హెచ్పీ గ్యాస్ చెందిన ఉద్యోగులు మండలంలోని అనేక గ్రామంలో తిరుగుతూ వినియోగదారుల నుండి 240 వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

అయితే ఈ విషయమై హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ(HP Gas Agency) డీలర్ తూము శ్రీధర్ను వివరణ కోరగా వినియోగదారుల ఇష్టానుసారంగానే కంపెనీ వారు డబ్బులు తీసుకొని రికార్డులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వినియోగదారులకు నష్టపరిహారం అందే విధంగా చూడాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు