ఎంజిఎం హైస్కూల్‌లో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు
28-09-2026 | 10:58pm
గణపురం, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): చెల్పూర్ ఎంజిఎం హైస్కూల్(MGM High School)లో గ్రాండ్ పేరెంట్స్ డే(Grandparents Day) వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తాతయ్యలు, అమ్మమ్మలకు వివిధ ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రాండ్ పేరెంట్స్ ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ మనుమలు, మనుమరాళ్లతో ఉన్న మమకారం, అనురాగాన్ని చాటుకున్నారు. పోటీల్లో విజేతలకు పాఠశాల కరస్పాండెంట్ గ్యాందంగి సతీష్ బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తాతయ్యలు, అమ్మమ్మలకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.