మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం..

28-09-2026 | 10:41pm

బాన్సువాడలో రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ తరగతులకు హాజరు..

బాన్సువాడ, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి సోమవారం సాయంత్రం విచ్చేసిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి(Media Academy Chairman K Srinivas Reddy)కి బాన్సువాడ జర్నలిస్టులు ఘన స్వాగతం పలికారు.

బాన్సువాడలోని ఎస్ ఆర్ ఎన్ కే.డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ తెలిపారు.

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో మీడియా బాధ్యత, జర్నలిస్టులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొననున్నారు.ఈ కార్యక్రమంలో ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.ఏ. లతీఫ్‌,జిల్లా కార్యదర్శి రాజేష్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్, జర్నలిస్టులు ఎర్రవట్టి పోశిరాం.రాజేశ్వర్ రెడ్డి,మెయిన్,సాయ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్,సాయి రెడ్డి,రమణ, సతీష్, శ్రీను, ప్రచేతన్, ఇలియాస్ ఆనంద్ నబి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు