గణనాధునికి ఘనంగా పూజలు
28-09-2026 | 11:03pm
ఆమనగల్: పట్టణంలోని ప్రేమనగర్ కాలనీలో ప్రతిష్టించిన గణనాథుని వద్ద సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుని వద్ద ఆమనగల్లు మాజీ సర్పంచ్, మార్కెట్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు(Gurram Keshavulu) ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు పసుపుల సాయిలు, నాయకులు గంగిశెట్టి చంద్రయ్య, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పసుపుల శివ చరణ్, భార్గవ్ ,నిఖిల్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.