తాడువాయి ట్రాన్స్‌కో ఏఈ బదిలీ...
విజయక్రాంతి ఎఫెక్ట్..
- దురుసు ప్రవర్తనే బదిలీకి కారణం..
తాడ్వాయి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల ట్రాన్స్‌కో ఏఈ కరుణాకర్(Transco AE Karunakar)పై బదిలీ వేటు పడింది. ఈ నెల 26న విజయక్రాంతిలో ప్రచురితమైన సీఎంకు చెప్పుకుంటారో.. చెప్పుకోండి... అనే వార్తకు అధికారులు స్పందించారు. ఆయనను తాడువాయి నుంచి బదిలీ చేశారు.
లో వోల్టేజ్ తో ఇబ్బందులు పడుతున్న మండలంలోని చందాపూర్ గ్రామ రైతులు 20 మంది సబ్ స్టేషన్ కు వచ్చి ట్రాన్స్కో ఏ ఈ తో సమస్య చెప్పుకున్నారు.మీకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యను పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆయనతో వాగ్వాదం పెట్టుకున్నారు.
దీనిపై విసుక్కున్న ఏఈ కరుణాకర్ నేను ఫోను లేపను, నా ఇష్టం మీరు ఫోన్ చేస్తే నేను ఫోను లేపడానికి అటెండర్ నా అంటూ ఏఈ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించారు.దీంతో ఉన్నత అధికారులు స్పందించి ఆయనను నిజామాబాదుకు బదిలీ చేశారు. ఆయనపై గతంలోను చాలా ఆరోపణలు ఉన్నాయి.సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, ఏ విషయాలు పట్టించుకోడనే ఆరోపణలు ఉన్నాయి.ఎప్పుడూ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించిన సర్పంచులు, ఎంపీటీసీలు ట్రాన్స్కో సమస్యలపై గట్టిగా ఏఈని నిలదీసేవారు.