రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి
28-09-2026 | 10:55pm
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నియోజకవర్గం పరిధిలోని యాచారం మండలం(Yacharam Mandal) చౌదర్ పల్లి వెళ్లే దారిలో అటుగా వస్తున్న జేసీబీ ఢీకొట్టడంతో ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్ అక్కడే మృతి చెందాడు. చౌదరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సంతోష్ కుమార్(30) అతనికి భార్య ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. స్వగ్రామం యాచారం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుండగా అతను ప్రయాణం చేస్తున్న బైకును విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద జేసిబి వాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యాచారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.