మంత్రి ఉత్తమ్ ను కలిసిన వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గం
నేరేడుచర్ల అక్టోబర్ 09(విజయ క్రాంతి):- నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ(Nereducherla Agricultural Market Committee) నూతన పాలకవర్గం శుక్రవారం హైదరాబాద్ లో భారీ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని(Uttam Kumar Reddy) మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. నేరేడుచర్ల మండల(Nereducherla Mandal) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు నూకల సందీప్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చలసాని శ్రీనివాస్ నూతన పాలకవర్గం కమిటీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరిచయం చేశారు.
నూతన కమిటీ కష్టపడి పని చేసి రైతులకు సేవ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అనంతరం నూతన కమిటీకి శుభాకాంక్షలు అందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గ చైర్ పర్సన్ రంగినేని స్పందన రాజీవ్, వైస్ చైర్మన్ మునగాల భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు పార్టీ నాయకులు కౌన్సిలర్లు బొలిశెట్టి లక్ష్మయ్య తాళ్ల సురేష్ రెడ్డి, అలక శ్రావణ్ రెడ్డి వల్లంశట్ల రమేష్ బాబు, బచ్చలకూరి ప్రకాష్, యారవ శ్రీనివాస్, కల్లూరు సర్పంచ్ చలసాని మంజుల, ఇంజమూరి శ్రీకాంత్, శ్రీను కత్తి శ్రీనివాస్ రెడ్డి ఖాదర్ తదితరులు పాల్గొన్నారు