శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో దుర్గాదేవి
భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు
నేరేడుచర్ల, అక్టోబర్ 17(విజయక్రాంతి): శ్రీ దేవీ నవరాత్రి వేడుకలలో(Sri Devi Navaratri Celebrations) భాగంగా మూడవ రోజు శ్రీ విజయ దుర్గాదేవి(Sri Vijaya Durga Devi) శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో శనివారం దర్శనమిచ్చారు. నేరేడుచర్ల పట్టణంలో(Nereducherla town) గల శ్రీ విజయదుర్గ దేవి ఆలయం,శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఆలయంలో ఏడవ రోజు శ్రీ దేవీ నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారికి ప్రీతిగా దీర్ఘ సుమంగల్యాభివృద్ధికి, సుహాసినిలచే వివాహ ప్రాప్తికి కన్యలకు అనుకూల వరప్రాతికి సామూహిక కుంకుమార్చనలు ఎంతో భక్తిశ్రద్ధలతో(Devotional) నిర్వహించారు.
ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.ఆలయ అర్చకులు మొలుగు శ్రీనివాసాచార్యులు,ఉగ్రదండి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమ పూజ నిర్వహించారు. నేరేడుచర్ల పట్టణంతో పాటు మండలంలోని పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు..దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా,అమ్మవారి దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా తిలకించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ చైర్మన్ కొనతం ఆదిరెడ్డి, కొనతం చిన్న వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు,నాగండ్ల శ్రీధర్, బొలిశెట్టి లక్ష్మయ్య, సంకల మద్ధి సత్యనారాయణ రెడ్డి, మెడిసిన మెట్ల శివ, బెల్లంకొండ శేఖర్, కొనతం రామిరెడ్డి, కొనతం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, వేమిరెడ్డి శంకర్ రెడ్డి,కొనతం లచ్చిరెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదం పంపిణి చేశారు.