దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట అక్టోబర్ 17 (విజయక్రాంతి): కోనరావుపేట మండల(Konaraopeta Mandal) పరిధిలోని పలు గ్రామాల్లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Adi Srinivas) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని అమ్మవారి మండపాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గాదేవి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.