పెద్దతాండలో ఉచిత విత్తనాల పంపిణీ

17-10-2026 | 10:25pm

సర్పంచ్ యం. నార్య నాయక్

మల్దకల్ అక్టోబర్ 17: గద్వాల నియోజకవర్గం(Gadwal Constituency) మల్దకల్ మండలం  మండలం పెద్దతాండ, గ్రామంలో రైతులకు(Farmer) వ్యవసాయంలో అండగా నిలిచేందుకు పెద్దతాండ గ్రామపంచాయతీ(Peddatanda Grama Panchayat) ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా మినుములు, జొన్న విత్తనాలను(Black gram and sorghum seeds) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యం. నార్య నాయక్ రైతులకు విత్తనాలను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇచ్చి, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటలను ఎంపిక చేసుకోవాలి” అని సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఉచిత విత్తనాలు పంపిణీ చేస్తున్నామని, అవసరమైన రైతులు గ్రామపంచాయతీ కార్యాలయంలో విత్తనాలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యం. బిక్య నాయక్, వ్యవసాయ శాఖ ఏఈఓ, గ్రామ రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు