బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ

17-10-2026 | 10:56pm

మల్కపేటలో మహిళలకు చీరలు పంపిణీ చేసిన వార్డు మెంబర్ ఆరే పరశురాములు.

కోనరావుపేట అక్టోబర్ 17 (విజయక్రాంతి): బతుకమ్మ పండుగను(Bathukamma Festival) పురస్కరించుకొని కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలోని(Malkapeta Village) 5వ వార్డు మహిళలకు వార్డు మెంబర్ ఆరే పరశురాములు చీరలను పంపిణీ(Distribution of sarees) చేశారు. పండుగ సందర్భంగా మహిళలకు చీరలు అందజేసి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సంతోషంగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఆరే లత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు