ఆదిలాబాద్ టూ కేలాపూర్ పాదయాత్ర ను ప్రారంభించిన ఎమ్మెల్యే
జై జై మాతాది నినాదాలతో హోరెత్తిన పట్టణం...
ఆదిలాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో(Devi Sharannavaratri celebrations) భాగంగా ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర లోని ప్రసిద్ధ కేలాపూర్ జగదంబ మాత ఆలయం(Kelapur Jagadamba Mata Temple) వరకు చేపట్టే భక్తుల పాదయాత్రను ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) ప్రారంభించారు. శనివారం మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష(Municipal Chairperson Bhandari Anusha) తో కలిసి ముందుగా శ్రీ రాణిసతిజీ మాత మందిరంలో పూజలు చేసి, జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. శ్రీ జగ్గంబ మాత మండలి ఆధ్వర్యంలో గత 32 ఏళ్లుగా ఈ పాదయాత్ర కొనసాగుతోంది.
కాషాయపు జెండాలను చేతపట్టుకుని జై మాతాది నినాదాల నడుమ భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. గత 32 సంవత్సరాల నుండి జగదంబ మాత మండలి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం అభినందనీయం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అమ్మవారి దయతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు, హిందూ సంఘాల సభ్యులు, పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.