SBI ఖాతాలో మరో అరుదైన ఘనత
SBIకి గ్లోబల్ జాక్‌పాట్.. 2026లోనూ వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్!
భారత బ్యాంకింగ్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన State Bank of India (SBI) ప్రతిష్ఠాత్మక World’s Best Consumer Bank 2026 అవార్డును గెలుచుకుంది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఈ పురస్కారాన్ని ఎస్బీఐ వరుసగా రెండో ఏడాది దక్కించుకుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం, డిజిటల్ బ్యాంకింగ్‌లో కొత్త ఆవిష్కరణలు తీసుకురావడం, సేవల నాణ్యతను పెంచడం వంటి అంశాల్లో బ్యాంక్ సాధించిన పురోగతికి ఈ గుర్తింపు లభించినట్లు ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది.
SBI Global Award 2026ను అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వార్షిక సమావేశం సందర్భంగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో బ్యాంక్ ప్రతినిధులకు అందజేశారు. కస్టమర్ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడం, డిజిటల్ సేవలను విస్తరించడం, సమాజంలోని వివిధ వర్గాలకు ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలకు ఈ అవార్డు ప్రాధాన్యం ఇస్తుంది. వరుసగా రెండోసారి ఈ పురస్కారం దక్కించుకోవడం ద్వారా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐ తన స్థానాన్ని మరోసారి చాటుకుంది. ఈ గుర్తింపు బ్యాంక్ సేవలపై వినియోగదారుల ఆసక్తిని పెంచే అంశంగా నిలవనుంది.