శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సరిత తిరుపతయ్య

17-10-2026 | 10:39pm

కంచుపాడు ఎల్లమ్మ ఆలయంలో గాయత్రీ దేవికి ప్రత్యేక పూజలు

ఉండవల్లి, అక్టోబర్ 17: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు