దసరా వేళ పాలపిట్టకు రక్షణ కవచం
17-10-2026 | 10:54pm
అచ్చంపేట, అక్టోబర్ 17 : దసరా సందర్భంగా పాలపిట్టలను బంధించడం, హింసించడం అరికట్టేందుకు అటవీ శాఖ(Forest Department) అవగాహన కార్యక్రమం చేపట్టింది. అచ్చంపేట(Achampet)లోని సమీకృత అటవీ సముదాయంలో జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర(District Forest Officer Revanth Chandra) (ఐఎఫ్ఎస్) సంరక్షణ పోస్టర్లను విడుదల చేశారు. పాలపిట్టలను బంధించడం, చంపడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పక్షుల స్వేచ్ఛను గౌరవిస్తూ దసరా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీఎఫ్ చంద్రశేఖర్తో పాటు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.