పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలి

17-10-2026 | 10:31pm

జిల్లా స్థాయి సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జె జీవన్ కుమార్

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 17 ( విజయక్రాంతి ) : పెండింగ్ కేసుల(pending cases) పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె జీవన్ కుమార్(J. Jeevan Kumar) అన్నారు. జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టడానికి శనివారం వారు అన్ని శాఖల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసుల్లోని బాధితులకు అందుతున్నటువంటి నష్టపరిహారం, జైళ్లలో ఉన్న నిందితుల వివరాలను, వారి స్థితిగతులను జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి తాడూరి మహతి వైష్ణవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి అఖిల, అదనపు ఎస్పీ ఏ నరేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమర్, డీఎస్పీలు సంపత్ రావు, సూర్యనారాయణ, ఫారెస్ట్ అధికారి అప్పలకొండ, ఎస్ఐలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు