మహాలక్ష్మి అవతారంలో భ్రమరాంబ

17-10-2026 | 10:49pm

రాజాపూర్ అక్టోబర్ 17: మండలంలోని తిరుమలాపూర్ గ్రామం(Tirumalapur Village)లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి(Sri Bhramarambika Mallikarjuna Swamy) దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం బ్రమరాంబికా దేవిని మహాలక్ష్మి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించారు. అమ్మవారికి 100,50,20,10 రూపాయల నోట్లతో దండలు అల్లి అలంకరించి తమ మహాలక్ష్మి దేవి పై తమ భక్తిని చాటుకున్నారు. సాయంత్రం ఆలయంలో కుంకుమార్చన లలిత సహస్రనామం పారాయణ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు నరసింహమూర్తి తెలిపారు.

మరిన్ని వార్తలు