పంట మార్పిడితో అధిక దిగుబడులు

13-10-2026 | 06:24pm

రైతులకు సాగు మెళకువలపై అవగాహన

చివ్వెంల, అక్టోబర్ 13: రైతులు పంట మార్పిడి, సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటించాలని కేవీకే శాస్త్రవేత్తలు ఎ. కిరణ్, సి.హెచ్. నరేష్ సూచించారు. మంగళవారం చివ్వెంల మండలంలోని పాత గ్రామ పంచాయతీ ఆవరణలో రావే కార్యక్రమంలో భాగంగా లయోలా కళాశాల(Loyola College) వ్యవసాయ విద్యార్థినులు గ్రామీణ వ్యవసాయ పరిస్థితులపై అధ్యయనం చేశారు.

గ్రామ పటం, పైచార్ట్‌ల ద్వారా రైతుల సమస్యలు, నీటి వనరులు, చీడపీడల నివారణ పద్ధతులపై అవగాహన కల్పించారు. పంట మార్పిడితో భూసారాన్ని కాపాడుకొని మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు