ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి

09-10-2026 | 10:54pm

సర్పంచ్ గువ్వల శిరీష వెంకటరమణ 

కోదాడ అక్టోబర్ 9(విజయక్రాంతి) : కోదాడ మండలం(Kodad Mandal), అడ్లూరు గ్రామంలో భూగర్భ జలాల(Groundwater) పెంపునకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని అడ్లూరు గ్రామ సర్పంచ్ గువ్వల శిరీష వెంకటరమణ సూచించారు. శుక్రవారం గ్రామపంచాయతీ ఆఫీస్(Gram Panchayat Office) వద్ద ఇంకుడ గుత(Infiltration pit) ప్రారంభించి మాట్లాడారు. వర్షపు నీటిని వృథా చేయకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి మళ్లించి భూగర్భ జలాలను పెంపొందించవచ్చని తెలిపారు.

భవిష్యత్తులో నీటి కొరతను నివారించేందుకు ప్రతి కుటుంబం బాధ్యతగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో నీటి వనరులను కాపాడుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఉపేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు