జిల్లా భాజపా అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు
నేరేడుచర్ల, అక్టోబర్26 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ నేరేడుచర్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి(Challa Srilatha Reddy) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలో కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ జన్మదిన వేడుకలలో జిల్లా కోశాధికారి తాళ్ళ నరేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొనతం నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాలం నాగయ్య, జిల్లా దివ్యాంగుల సెల్ కన్వినర్ ఏమిరెడ్డి శంకర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సంకలమద్ది సత్యనారాయణరెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొప్పు లక్ష్మీనారాయణ ,జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు నందిపాటి. హిందూజ, కాలం శైలజ, బుస్సా విమల, కృష్ణవేణి నాయకులు కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.