ఘనంగా వాల్మీకి జయంతి
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ఒక బోయవాడు గొప్ప కవిగా ఎలా మారాడో వాల్మీకి జీవితమే ఉదాహరణ అని చెప్పారు.
ఆయన వల్లనే రామతత్వం అందరికీ బోధపడిందని, ఆయన రచించిన ఏడు కాండాల రామాయణం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఆయన జీవితాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ జయంతి వేడుకల్లో డిప్యూటీ కలెక్టర్ రాకేష్, బిసి అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ శంకర్, డిఈవో భోజన్న, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఎల్డిఎం రామ్ గోపాల్, సహాయ బిసి అభివృద్ధి అధికారి సత్యనారాయణ రెడ్డి, జిల్లా వాల్మీకి సంఘ ప్రతినిధులు ఆకుల సుదర్శన్, వేల్పుల మల్లేష్, ఎండపల్లి అశోక్, ఆకుల రాజేశ్వర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.