ముంబై పగ్గాలు మళ్లీ హిట్‌మ్యాన్ చేతికి!

27-11-2026 | 06:13pm

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌(IPL)లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్(Mumbai Indians) మళ్లీ తన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై నమ్మకం ఉంచింది. ఐపీఎల్ 2027 సీజన్‌కు హిట్‌మ్యాన్‌ను జట్టు సారథిగా ఎంపిక చేసింది. దీంతో ముంబై అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. రోహిత్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో జట్టుకు ట్రోఫీలు అందించాడు. 2023 తర్వాత మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

గత మూడు సీజన్లుగా ముంబైకి నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా(Hardik Pandya) తాజాగా పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ అయ్యాడు. దీంతో ఖాళీ అయిన కెప్టెన్సీ స్థానాన్ని భర్తీ చేస్తూ యాజమాన్యం రోహిత్‌కు అవకాశం ఇచ్చింది. 2020 తర్వాత టైటిల్ గెలవని ముంబై.. ఇప్పుడు హిట్‌మ్యాన్ సారథ్యంలో ఆరో ట్రోఫీని సాధించాలని పట్టుదలతో ఉంది. రోహిత్ తిరిగి కెప్టెన్ కావడంతో ముంబై అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అనుభవం, నాయకత్వ పటిమతో జట్టును మళ్లీ ఛాంపియన్‌గా నిలబెడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు