ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తా

19-10-2026 | 05:20am
  1. జట్టు కోసం తప్పదు
  2. తిలక్ వర్మ వ్యాఖ్యలు

బెంగళూరు, అక్టోబర్ 18 : జట్టు విజయం కోసం తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తానని భారత క్రికెటర్ తిలక్ వర్మ(Indian cricketer Tilak Varma) స్పష్టం చేశాడు. రెగ్యులర్‌గా మూడో స్థానంలో దిగే తిలక్ కొన్ని రోజులుగా ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఈక్రమంలో మంచి ఇన్నింగ్స్‌లే ఆడుతున్నాడు. అయితే ఐదారు స్థానాల్లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌ను ఫినిష్ చేసే బాధ్యతను సక్ర మంగా నిర్వర్తించేందుకు నెట్స్‌లో కఠోరంగా సాధన చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.

వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన తర్వాత ఆటగాడిగా తన బాధ్యత మరింత పెరిగిం దన్నాడు. తన కొత్త పాత్రలోని సవాళ్లను అధిగమించడానికి.. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం తో పాటు మానసికంగా సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. అయితే వ్యక్తిగతంగా తనకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయ డం సులభంగా ఉంటుందనీ, కానీ జట్టులో ఆయా కాంబినేషన్ల కోసం ప్లేస్ మారిందన్నాడు. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అద్భుతంగా ఆడుతుండడంతో తాను త్యాగం చేయక త ప్పడం లేదన్నాడు.  చాలా మ్యాచ్‌లలో ఐదు, ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చి రాణించడంతో తన కాన్ఫిడెన్స్ కూడా పెరిగిందని చెప్పాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యా టింగ్ చేయడం పెద్ద సవాల్ అన్నాడు. ఫినిషర్‌గా బ్యాటింగ్కు వచ్చినప్పుడు ఐదు, ఆరు ఓవర్లు మాత్రమే మిగిలుంటాయన్నాడు. 

మరిన్ని వార్తలు