వినియోగదారులకు శాంసంగ్ గుడ్‌న్యూస్
దీపావళి(Diwali) పండుగ వేళ గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు శాంసంగ్(Samsung) శుభవార్త అందించింది. 2026 పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తన బిస్పోక్ ఏఐ (Bespoke AI) గృహోపకరణాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా ఎంపిక చేసిన ఉత్పత్తులపై గరిష్టంగా రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తోంది. అంతేకాకుండా, కేవలం రూ.888 ప్రారంభ ఈఎంఐతో తమకు నచ్చిన ఉపకరణాలను కొనుగోలు చేయవచ్చు.
'ట్రిపుల్ జీరో ఆఫర్'లో భాగంగా జీరో డౌన్‌పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఎంపిక చేసిన పథకాలపై ఆరు నుంచి పది నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. శాంసంగ్ ఫైనాన్స్+ ద్వారా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, టీవీఎస్ క్రెడిట్ భాగస్వామ్యంతో ఈ ఆర్థిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా శాంసంగ్ కేర్+ ద్వారా మూడేళ్ల వరకు అదనపు వారంటీ పొందే అవకాశం కూడా ఉంది.
ఈ ప్రత్యేక ఆఫర్లు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, వాక్యూమ్ క్లీనర్లు, ఓవెన్లు, డిష్వాషర్ల వంటి పలు బిస్పోక్ ఏఐ ఉత్పత్తులకు వర్తిస్తాయి. ఈ ఉపకరణాల్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఇంటి పనులను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్లోని జనరేటివ్ ఏఐ, ఏఐ ఫుడ్ మేనేజర్ ఫీచర్లు ఆహార పదార్థాలను గుర్తించడం, వాటి నిల్వలను పర్యవేక్షించడం, గడువు ముగియనున్న వస్తువుల గురించి హెచ్చరించడం వంటి సదుపాయాలను అందిస్తాయి.
స్మార్ట్‌థింగ్స్ ఫుడ్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్న పదార్థాలకు అనుగుణంగా వంటకాల సూచనలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లపై శాంసంగ్ ఇండియా డిజిటల్ అప్లయెన్సెస్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ గుఫ్రాన్ ఆలం స్పందిస్తూ, వినియోగదారుల రోజువారీ పనులను సులభతరం చేయడంతో పాటు పండుగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ఈ ఆఫర్లను తీసుకొచ్చినట్లు తెలిపారు. శాంసంగ్ అధికారిక వెబ్సైట్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ దుకాణాల్లో ఈ ఆఫర్లు నవంబర్ 15, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే, క్యాష్‌బ్యాక్, ఈఎంఐ, వారంటీ ప్రయోజనాలు ఎంపిక చేసిన మోడళ్లు, వర్తించే నిబంధనలపై ఆధారపడి ఉంటాయి.