అమ్మవారి సేవలో రాజుగౌడ్..ఘనంగా అన్నప్రసాద వితరణ!

19-10-2026 | 08:34am

రామచంద్రపురం, అక్టోబర్ 19: రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరులో దేవీ నవరాత్రుల (Devi Navaratri) సందర్భంగా మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు నిత్య అన్నప్రసాదం (Annadanam) అందిస్తున్నారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తనకు తోచినంతగా అమ్మవారి పేరుతో, ఆమె ఆశీస్సులతో వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు తెలిపారు. తమ గ్రామంలో భక్తిభావంతో పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డీజేలు, బ్యాండ్లు లేకుండా భజనలు, తాళమేళాలతో భక్తి మార్గంలో ఊరేగింపు (Procession) నిర్వహిస్తున్నట్లు వివరించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు రాజు గౌడ్ (Raju Goud) పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు