మైదానంలో సిక్సర్లు.. ఇంట్లో స్టెప్పులు
భారత యువ టీ20 స్టార్ అభిషేక్ శర్మ ఇంట దీపావళి సంబరాలు (Diwali Celebrations) అంబరాన్నంటాయి. పండుగ వేళ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ యువ క్రికెటర్ ఆనందంగా గడిపాడు. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారితో కలిసి సరదాగా నృత్యం చేస్తూ సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్‌గా మారింది.
అభిషేక్ శర్మ సోదరి కోమల్ ఈ వీడియోను తన ఖాతాలో పంచుకున్నారు. అందులో అభిషేక్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేస్తూ కనిపించాడు. ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ ఆలపించిన ‘బోలో తా రా రా’ పాటకు అందరూ కలిసి స్టెప్పులు వేశారు. అభిషేక్ సైతం ఎంతో ఉత్సాహంగా నృత్యం చేస్తూ వేడుకల్లో సందడి చేశాడు.
సాధారణంగా మైదానంలో తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించే అభిషేక్.. ఈసారి కుటుంబ వేడుకల్లో తన నృత్యంతో ఆకట్టుకున్నాడు. క్రికెట్‌కు కొంత విరామం ఇచ్చి కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకున్నాడు. అతడి వీడియో అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఈ వీడియో చూసిన అభిమానులు అభిషేక్ నృత్యంపై సరదాగా స్పందిస్తున్నారు. ఆటలోనే కాకుండా పండుగ వేడుకల్లోనూ తన ఉత్సాహాన్ని చూపించాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి అభిషేక్ ఇంట దీపావళి వేడుకల వీడియో (Viral Video) సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.